Telugu Global
CRIME

పుష్ప2 సినిమా విడుదల.. సంధ్య థియేటర్‌లో విషాదం

హీరో అల్లు అర్జున్‌ థియేటర్‌కు రావడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి

పుష్ప2 సినిమా విడుదల.. సంధ్య థియేటర్‌లో విషాదం
X

ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్నది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌కు హీరో అల్లు అర్జున్‌ వచ్చారు. ఆయనను చూడటానికి అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది.

మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్వా డి కోసమే మేము సినిమాకి వచ్చామని ఆయన తండ్రి భాస్కర్ తెలిపారు.మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉన్నారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో రద్దీ పెరిగిందన్నారు.ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందన్నారు. పోలీసులు సీపీఆర్‌ చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా రేవతి భర్త కన్నీటి పర్వంతమయ్యారు. ఇప్పటికీ ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించలేదు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. సంధ్య థియేటర్ పై చర్యలు తీసుకోవాలి రేవతి బంధువులు డిమాండ్‌ చేశారు. మరోవైపు మహిళ ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించింది.

First Published:  5 Dec 2024 7:45 AM IST
Next Story