Telugu Global
CRIME

ఆ మాజీ సీఎంకు పరువు నష్టం కింద రూ.1.10 కోట్లు చెల్లించండి

హైద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఆ మాజీ సీఎంకు పరువు నష్టం కింద రూ.1.10 కోట్లు చెల్లించండి
X

మాజీ ముఖ్యమంత్రి పరువుకు నష్టం కలిగేలా ఆరోపణలు చేసినందుకు రూ.1.10 కోట్లు పరిహారం చెల్లించాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని కొడనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు టీ ఎస్టేట్‌ ఉండేది. ఆమె అక్కడి ఫామ్‌ హౌస్‌ నుంచి ఎక్కువ కాలం పరిపాలన సాగించేవారు. టీ ఎస్టేట్‌ మధ్యలో సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ల కోసం విలావసంవతమైన నివాసం భవనం కూడా ఉండేది. పైకి మూడంతస్తులుగా కనిపించే జయలలిత ఫామ్‌ హౌస్‌ లోపల ఇంకో మూడు అంతస్తులు ఉంటుందని, బయటికి కనిపించని ఆ మూడు అంతస్తుల్లోనే రూ.వేల కోట్ల సంపదను ఆమె దాచి పెట్టారని ప్రచారంలో ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2016లో జయలలిత తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణం తర్వాత కొడనాడు ఫామ్‌ హౌస్‌ పరిసరాల్లో ఏడుగురు హత్యకు గురయ్యారు. కొనడాడు ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డ్‌, జయలలిత మాజీ డ్రైవర్‌ సహా హతుల్లో మరో ఐదుగురు ఉన్నారు. ఈ ఏడుగురిని మార్టిన్‌ అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఎస్టేట్‌ ఫామ్‌ హౌస్‌ లోని బంగారం దోపిడీకి కేరళకు చెందిన ముఠాతో కలిసి మార్టిన్‌ హత్యలు చేశాడని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అప్పటి తమిళనాడు సీఎం పళనిస్వామి జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికే వరుస హత్యలు చేయించారని మార్టిన్‌ సోదరుడు ధన్‌పాల్‌ ఆరోపణలు చేశారు. అప్పట్లో ధన్‌పాల్‌ ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. పళనిస్వామినే హత్యలు చేయించి నిందను మార్టిన్‌ పై వేస్తున్నాడనే చర్చ కూడా సాగింది. ధన్‌పాల్‌ ఆరోపణలపై పళనిస్వామి మద్రాస్‌ హైకోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ పై ఆరేళ్లు విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్‌ఎంటీ టీకా రామన్‌ తీర్పు వెలువరించారు. మాజీ ముఖ్యమంత్రి పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన ధన్‌పాల్‌ రూ.1.10 కోట్ల పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.

First Published:  10 Nov 2024 6:17 AM GMT
Next Story