Telugu Global
CRIME

పరిటాల రవి హత్య కేసు.. ఐదుగురు నిందితులకు బెయిల్‌

18 ఏళ్ల తర్వాత నిందితులకు మంజూరు చేసిన న్యాయస్థానం

పరిటాల రవి హత్య కేసు.. ఐదుగురు నిందితులకు బెయిల్‌
X

మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత నిందితులకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణ రెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8) బెయిల్‌ మంజూరైంది. అనంతరం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగిన విషయం విదితమే.

ఈ సందర్భంగా హైకోర్టు షరతులు విధించింది. ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరు కావాలని.. 25 వేల రూపాయలతో రెండు పూచీ కత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. జైలు నుంచి విడుదలయ్యాక నడవడికి బాగాలేనట్టుగా ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇక 18 ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు కాబట్టి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్ కు సూచించింది. కానీ దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది.

First Published:  18 Dec 2024 6:49 PM IST
Next Story