మాదాపూర్ లో భారీ అగ్నిప్రమాదం
రాయదుర్గం నాలెడ్జి సిటీలోని సత్వ ఎలిక్సిర్ భవనంలో సంభవించిన ఘటన
BY Raju Asari21 Dec 2024 9:54 AM IST
X
Raju Asari Updated On: 21 Dec 2024 9:54 AM IST
మాదాపూర్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. రాయదుర్గం నాలెడ్జి సిటీలోని సత్వ ఎలిక్సిర్ భవనంలో ఈ ఘటన సంభవించింది. భవనంలోని 4,5 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలార్పుతున్నది. సిలిండర్లు పేలడంతో సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో సమీపంలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. వారిని అగ్నిమాపక సిబ్బంది బైటికి పంపారు.
Next Story