Telugu Global
CRIME

ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ రద్దు

ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ రద్దు
X

కోల్ కతా ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు మెడికల్ రిజిస్ట్రేషన్ ను పశ్చిమ బెంగాల్ మెడికల్ మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది.ఇక నుంచి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దని తెలిపింది. ప్రిస్క్రిప్షన్లు కూడా రాయడానికి అవకాశం కూడా లేదని హెచ్చరించింది. మెడికల్ కౌన్సిల్ఈ నెల 6 సందీప్ ఘోష్ కు నోటీసు పంపింది. ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను డబ్ల్యూబీఎంసీ నిర్వహించే రిజిస్ట్రర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌ల జాబితా నుంచి తొలిగించినట్లు గురువారం సంబంధిత అధికారులు వెల్లడించారు. 1914 బెంగాల్‌ వైద్య చట్టం కింద సందీప్‌ ఘోష్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై నిరసనల మధ్య ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సందీప్‌ ఘోష్‌ను సీబీఐ సెప్టెంబర్ 2 న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

First Published:  20 Sep 2024 4:52 PM GMT
Next Story