Telugu Global
CRIME

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ హత్య రాజకీయంగా దుమారం రేపే అవకాశం

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య
X

మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ముంబాయి బాంద్రాలోని తన కుమారుడి కార్యాలయం బైట సిద్ధిఖీ పై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆయనను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. ముంబయి పోలీసులు తెలిపారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌, హర్యానాకు చెందిన వారిగా వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు.

సిద్ధిఖీ మరణవార్త విని షాక్‌ గురయ్యాని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిద్ధిఖీపై దుండగులు కాల్పులు జరిపారని ముంబయి అడిషనల్‌ సీపీ పరంజీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఘటనపై ముంబయి క్రైం బ్యాంచ్‌ దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించారు. కాల్పులకు ఉయోగించిన పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవలు అందించిన సిద్ధిఖీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు. బాంద్రా వెస్ట్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004-08 మధ్య కార్మిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉన్నది.

First Published:  13 Oct 2024 3:19 AM GMT
Next Story