వికారాబాద్ ఎస్పీ, అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం
గిరిజన మహిళలపై ఎందుకు అసభ్యంగా ప్రవర్తించారని నిలదీసిక కమిషన్ మెంబర్
వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులపై నేషనల్ ఎస్టీ కమిషన్ సీనియస్ అయ్యింది. సోమవారం నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామ అనుబంధ రోటిబండ తండాలో గిరిజనులతో సమావేశమయ్యారు. కలెక్టర్, అధికారులపై దాడి చేశారని చెప్తూ పోలీసులు అర్ధరాత్రి తమ ఇండ్లపైకి వచ్చారని, కరెంట్ తీసేసి.. గడ్డపారలతో తలుపులు పగలగొట్టి ఇండ్లలోకి చొరబడ్డారని మహిళలు వివరించారు. మహిళలను అసభ్యతంగా తాకారని, లైంగికంగా వేధించారని వివరించారు. ఏ తప్పు చేయకున్నా తమ పిల్లలను అరెస్టు చేశారని తెలిపారు. గిరిజన మహిళలు చెప్పిన సమాచారంతో నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వికారాబాద్ ఎస్పీకి ఫోన్ చేశారు.. మహిళలపై ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తారని నిలదీశారు. గిరిజనులను వేధింపులకు గురి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.