ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ ఎకౌంట్ సస్పెండ్
ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్ చేసినందుకు చర్యలు
BY Naveen Kamera7 Feb 2025 3:36 PM IST
![ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ ఎకౌంట్ సస్పెండ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ ఎకౌంట్ సస్పెండ్](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401206-arvind-x-account.webp)
X
Naveen Kamera Updated On: 7 Feb 2025 3:36 PM IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు 'ఎక్స్' షాక్ ఇచ్చింది. ఆయన టీమ్ నడపించే అర్వింద్ ధర్మపురి ఆర్మీ ట్విట్టర్ (ఎక్స్) ఎకౌంట్ ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్పింగ్ చేసి అర్వింద్ ధర్మపురి ఆర్మీ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. మహిళలను అవమానించేలా అసభ్యకరమైన ఫొటో, వీడియోలు పోస్ట్ చేసినందుకు ట్విట్టర్ హ్యాండిల్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఎక్స్ అధికారికంగా ప్రకటించింది.
Next Story