సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. తల్లీ కుమారుడిని నడిరోడ్డుపై నాగరాజు అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఈ ఘటన జరిగింది. మృతులను సరోజాదేవి,అనిల్‌గా గుర్తించారు. ఆరు నెలల కిందట తన రెండున్నరేళ్ల కొడుకు మృతి కారణమని భావిస్తూ.. కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Previous Articleశ్రీవారికి ఆదికేశవుల నాయుడు మనవరాలు భారీ విరాళం
Next Article జనాలు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చోవడానికి కాదు
Keep Reading
Add A Comment