మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కమిటీ సెక్రటరీ దామోదర్ సహా 18 మంది మృతిచెందినట్టు అధికారిక ప్రకటన
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు 18 మంది మృతిచెందారని అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ బస్తర్ సెక్రటరీ గంగా పేరుతో ఈ ప్రకటనను శనివారం విడుదల చేశారు. మృతుల్లో తెలుగు వారైన మరో నాయకుడు నర్సింహారావు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లికి చెందిన చొక్కారావు మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. అంచలంచెలుగా ఎదిగి పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. మావోయిస్టు పార్టీ మిలటరి వింగ్ కు ఆయన చీఫ్‌గా సేవలందించారు. ఆ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మృతిచెందారని వార్తలు వచ్చాయని.. అది నిజం కాదని మొత్తం 18 మంది మృతిచెందారని మావోయిస్టు పార్టీ తమ ప్రకటనలో వెల్లడించింది.