చోరీ సమయంలో నిద్రపోయి అరెస్టైన దొంగ
చెన్నై అమింజకరై నెల్సన్ మాణిక్కంసాలైలో బ్యూటీపార్లర్ లో ఘటన
BY Raju Asari30 Dec 2024 5:02 AM IST
X
Raju Asari Updated On: 30 Dec 2024 5:02 AM IST
దొంగతనానికి వెళ్లి మద్యం మత్తులో నిద్రపోయిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అమింజకరై నెల్సన్ మాణిక్కంసాలైలో బ్యూటీపార్లర్ ఉన్నది. శుక్రవారం రాత్రి పార్లర్‌కు తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. శనివారం ఉదయం వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికివెళ్లి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు గుర్తించారు. పార్లర్ మేడపై నుంచి గురక శబ్దం రావడంతో పైకి వెళ్లి చూడగా మద్యం మత్తులో ఓ వ్యక్తి నిద్రపోతుండటాన్ని చూశారు. అతడిని నిద్ర లేపి విచారించగా తన పేరు శ్రీధర్ అని చెప్పారు. అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Next Story