Telugu Global
CRIME

సజ్జల భార్గవ్‌ పై లుక్‌ ఔట్‌ నోటీసులు

మరో నలుగురిపైనా నోటీసులు జారీ చేసిన కడప పోలీసులు

సజ్జల భార్గవ్‌ పై లుక్‌ ఔట్‌ నోటీసులు
X

వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జీ సజ్జల భార్గవ్‌ రెడ్డితో పాటు మరో నలుగురు సోషల్‌ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్ర రవీందర్‌ రెడ్డి, సజ్జల భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భార్గవ్‌ పై ఏపీలో ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి సజ్జల భార్గవ్‌ ప్రోత్సాహంతో ఫేక్‌ ఎకౌంట్లతో పోస్టింగులు పెడుతున్నామని విచారణలో వర్రా రవీందర్‌ రెడ్డి అంగీకరించారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే పలువురు సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు ఇప్పుడు వైసీపీ సోషల్‌ మీడియాలో కీలకంగా ఉన్న భార్గవ్‌ తో పాటు మరో నలుగురికి లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. వారి అరెస్ట్‌ కు రంగం సిద్ధం చేశారు.

First Published:  12 Nov 2024 8:43 PM IST
Next Story