Telugu Global
CRIME

ఏసీబీ ఆఫీస్‌ కు చేరుకున్న కేటీఆర్‌

ఫార్ములా -ఈ కార్‌ రేసులో విచారణ ఎదుర్కోబోతున్న మాజీ మంత్రి

ఏసీబీ ఆఫీస్‌ కు చేరుకున్న కేటీఆర్‌
X

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ బంజారాహిల్స్‌ లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఏఏజీ, సీనియర్‌ అడ్వొకేట్‌ రామచందర్‌ రావు ఉన్నారు. ఏసీబీ ఆఫీస్‌ లోని ప్రత్యేక గదిలో ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌, డీఎస్సీ, సీఐలతో కూడిన విచారణ బృందం కేటీఆర్‌ ను ప్రశ్నించనుంది. గురువారం ఉదయం నంది నగర్‌ లోని నివాసానికి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. కేటీఆర్‌ ఇంటికి వెళ్లకుండా మాజీ మంత్రి హరీశ్‌ రావును గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంపల్లిలోని తన నివాసం నుంచి హరీశ్‌ రావు నంది నగర్‌ కు చేరుకున్నారు. అంతకుముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్‌ కుమార్‌ నంది నగర్‌ లోని నివాసానికి చేరుకున్నారు. హరీశ్‌ రావు, కవిత, మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు, తన లీగల్‌ టీమ్‌ తో కాసేపు సమావేశమైన కేటీఆర్‌ అనంతరం తన నివాసం నుంచి ఏసీబీ ఆఫీసుకు బయల్దేరారు. ఏసీబీ ఆఫీస్‌ లోని లైబ్రరీలో లాయర్‌ రామచందర్‌ రావు వెయిట్‌ చేస్తారు. దానికి ఉన్న గ్లాస్‌ డోర్‌ నుంచి కేటీఆర్ విచారణను ఆయన పరిశీలిస్తారు.

First Published:  9 Jan 2025 10:19 AM IST
Next Story