Telugu Global
CRIME

వాళ్ల మధ్య ముద్దులు, హగ్గులూ నేరం కాదట!

కానీ కండీషన్స్‌ అప్లయ్‌ అంటూ మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

వాళ్ల మధ్య ముద్దులు, హగ్గులూ నేరం కాదట!
X

ప్రేమికుల మధ్య ముద్దులు, హగ్గులూ సహజమేనని, అది నేరం కాదని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముద్దులు, హంగులను నేరంగా పరిగణించలేమని అభిప్రాయపడింది. లైంగికంగా వేధించాలనే ఉద్దేశంతో అలాంటి చర్యలకు పాల్పడితే నేరమేనని స్పష్టం చేసింది. ఓ యువకుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న యువకుడు 19 ఏళ్ల యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఒకరోజు యువతిని ఒక ప్రాంతానికి పిలిపించి చాలా సేపు ఆమెతో ఉన్నాడు. ఈక్రమంలో ఆ యువతిని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత యువతిని దూరం పెడుతూ వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ముఖం చాటేశాడు. దీంతో యువతి అతడిపై పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్‌ ఆనందర్‌ వెంకటేశ్‌ యువకుడిపై లైంగిక వేధింపుల అభియోగాలు సరికావన్నారు. ఈ కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కు అనుమతిస్తే చట్టాన్ని దుర్వినియోగం చేసినట్టేనని సంచలన కామెంట్‌ చేశారు.

First Published:  15 Nov 2024 7:41 PM IST
Next Story