Telugu Global
CRIME

కిడ్నీ రాకెట్‌ కేస్‌: ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్‌

అలకనంద ఆస్పత్రిలో 20 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయన్నసీపీ సుధీకర్‌ బాబు

కిడ్నీ రాకెట్‌ కేస్‌: ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్‌
X

అలకనంద కిడ్నీ రాకెట్‌ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ సుధీకర్‌ బాబు తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. కిడ్నీ దాతలు నస్రీన్‌ బా, ఫిర్డోస్‌ గ్రహీతలు రాజశేఖర్‌, సుమంత్‌ అనే వ్యక్తి అలకనంద ఆస్పత్రిని నడిపిస్తున్నారని తెలిపారు. శస్త్రచికిత్సల్లో డాక్టర్‌ అవినాష్‌ది ప్రముఖ పాత్ర అని తెలిపారు. అవినాశ్‌ గతంలో జనని, అరుణ ఆస్పత్రులు నిర్వహించారన్నారు. సుమంత్‌ విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారని తెలిపారు. అలకనంద ఆస్పత్రిలో 20 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. దీంట్లో నిందితులైన ప్రదీప్‌, మిశ్రా, గోపి, రవి, రవీందర్‌, హరీశ్‌, సాయి అరెస్ట్‌ చేశామని తెలిపారు.

చైనా, కజకిస్ఠాన్‌లో వైద్య విద్య పూర్తి చేసిన వారు హైదరాబాద్‌ వచ్చి ఈ అక్రమ దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసేలా అవినాశ్‌కు లక్ష్మణ్‌ సలహా ఇచ్చాడు. దాతలకు రూ. 5 లక్షలు ఇచ్చి మిగతాది పంచుకోవచ్చని చెప్పాడు. ఇంకా కొందరు నిందితులు, దాతలు, గ్రహీతలను గుర్తించాల్సి ఉందని సీపీ తెలిపారు.

ఆ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి దందా బహిర్గతం కావడంతో ఎండీ సుమంత్‌ తో పాటు రిసెప్షనిస్ట్‌ గోపీని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని మరోసారి అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. కేసును సీఐడీకి అప్పగించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఐతే దానికి సంబంధించిన జీవో వెలువడాల్సి ఉన్నది. అనంతరమే కేసు సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సీఐడీకి బదిలీ కానున్నది. ఆ కేసులో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నది.

First Published:  25 Jan 2025 2:37 PM IST
Next Story