Telugu Global
CRIME

నేను ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయించలేదు

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నేను ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయించలేదు
X

తాను ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయించలేదని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో గురువారం విచారణకు హాజరైన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పానన్నారు. తనకు తెలిసిన ఆఫీసర్‌ కాబట్టే అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడానని చెప్పానన్నారు. ఆయనే మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు అడిగారని, తన అనుచరుల దగ్గర వాళ్ల నంబర్స్‌ తీసుకొని తిరుపతన్నకు ఇచ్చానని చెప్పారు. మునుగోడు ఎన్నికల ప్రచారం గురించి తిరుపతన్న తనను అడిగారని, ప్రచారం బాగా జరుగుతుందని తాను చెప్పానని అన్నారు. తాను వేముల వీరేశం అనుచరుల ఫోన్లు ట్యాప్‌ చేయించాననేది అవాస్తవమన్నారు. కొందరు మీడియాలో ఎక్స్‌పోజ్‌ అవ్వాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని అన్నారు. ఈ రోజు విచారణలో తన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారని, వాళ్ల దగ్గర ఏదో ఆదారం ఉంది కాబట్టే తనను పిలిచి విచారించారని భావిస్తున్నానని తెలిపారు.

First Published:  14 Nov 2024 2:44 PM IST
Next Story