Telugu Global
CRIME

మణిపూర్‌ లో మళ్లీ హైటెన్షన్‌

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం రద్దు చేసుకొని ఢిల్లీకి అమిత్‌ షా

మణిపూర్‌ లో మళ్లీ హైటెన్షన్‌
X

మణిపూర్‌ లో మళ్లీ హైటెన్షన్‌ నెలకొంది. గడిచిన వారం రోజులుగా రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో జిరిబామ్‌ జిల్లాలో పది మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో మహారాష్ట్రలో రెండు ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకొని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీకి తిరిగి చేరుకున్నారు. సీఆర్పీఎఫ్‌ డీజీ అనీశ్‌ దయాల్‌ మణిపూర్‌ కు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మణిపూర్‌ ఉద్రిక్తతల ప్రభావం తమ రాష్ట్రంపై పడకుండా మిజోరం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మణిపూర్‌ కు చెందిన 7,700 మంది ప్రజలు మిజోరాంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేతిలు, కుకీల మధ్య నెలకొన్న వర్గపోరులో మణిపూర్‌ ఇప్పటికీ అట్టుడుకుతోంది. 175 మందికి పైగా మృతిచెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో మణిపూర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

First Published:  17 Nov 2024 12:43 PM IST
Next Story