Telugu Global
CRIME

కేటీఆర్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఈ నెల 8న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్‌

కేటీఆర్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
X

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరనున్నది. ఫార్ములా-ఈ కారు రేస్‌లో ఈ నెల 8న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్‌ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేయనున్నది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

First Published:  15 Jan 2025 8:02 AM IST
Next Story