ఆ నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లు లిఫ్ట్ చేశారో.. మీ ఎకౌంట్లు గుల్ల!
హెచ్చరిస్తోన్న సైబర్ క్రైమ్ పోలీసులు
అన్ నోన్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బ్యాంక్ ఎకౌంట్లతో పాటు క్రెడిట్ కార్డులను గుళ్ల చేసే ప్రమాదముందని తేల్చిచెప్తున్నారు. ముఖ్యంగా +371, +375, +563, +370, +255 కోడ్ ప్రారంభమయ్యే నంబర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని తేల్చిచెప్తున్నారు. వాటితో పాటు +94777 455913, +37127 913091, +56322 553736, +37052 529259, +25590 1130460 లాంటి నంబర్లతో మొదలయ్యే ఫోన్ నంబర్లు లిఫ్ట్ చేసేప్పుడు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఆయా నంబర్లు, కోడ్‌ల నుంచి వచ్చే ఫోన్లు లిఫ్టు చేయగానే మొదట ఫోన్లు హ్యాంగ్ అవుతాయని.. ఆ ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లతో పాటు బ్యాంక్ ఎకౌంట్, క్రెడిట్ కార్డు డీటైల్స్ అన్నీ మూడు సెకన్లలోనే కాపీ చేసే ప్రమాదముందని తెలిపారు. ఆయా నంబర్ల నుంచి ఫోన్లు వచ్చిన తర్వాత కీపాడ్‌లో ఏవైనా నంబర్లు నొక్కాలని కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నంబర్లు నొక్కవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ #90, #09 నంబర్లను నొక్కితే ఆయా ఫోన్‌లోని సిక్ కార్డును యాక్సెస్ చేసి ఎవరికి ఫోన్ చేశారో వారే నేరానికి పాల్పడ్డారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు.