ఫామ్ హౌస్ కేసు.. విచారణకు హాజరైన విజయ్ మద్దూరి
వివిధ అంశాలపై ఆయనను విచారించిన పోలీసులు
జన్వాడా ఫామ్ హౌస్ కేసులో రాజ్‌పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రాజ్ పాకాల ఫామ్ కేసులో పార్టీ కేసులో ఆయన నిందితుడి (ఏ2)గా ఉన్నారు. దీంతో పోలీసులు వివిధ అంశాలపై ఆయనను విచారించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో విచారణ కొనసాగినట్లు సమాచారం.అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్‌పాకాలతోపాటు, కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరిపై పోలీసులు నమోదు చేశారు. ఆయనపై 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి స్టెషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
అయితే బీఆర్‌ఎస్ రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్ కుటుంబ సభ్యులను అడ్డుపెట్టుకుని రేవంత్ ప్రభుత్వం కేసులు పెడుతున్నదని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే మండిపడ్డారు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను పార్టీగా చిత్రీకరించి అందులో కేటీఆర్‌ను ఇరికించే కుట్రలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వది నెలల పాలనా వైఫల్యాలను కేటీఆర్ నిత్యం ఎండగడుతున్నారు. ముఖ్యంగా హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానానికి స్కెచ్ వేసిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.