ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్
నలుగురు మావోయిస్టులు మృతి
BY Naveen Kamera12 Jan 2025 4:59 PM IST

X
Naveen Kamera Updated On: 12 Jan 2025 4:59 PM IST
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో భద్రత దళాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో మావోయిస్టులు, భద్రద దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story