Telugu Global
CRIME

ఢిల్లీలో ఈడీ అధికారులపై భౌతికదాడి

ఢిల్లీలోని బిజ్వాసన్‌ అనే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయాలు

ఢిల్లీలో ఈడీ అధికారులపై భౌతికదాడి
X

సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులకు అనూహ్య ఘటన ఎదురైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు అధికారులపై దాడులకు దిగారు. ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్‌ అనే ప్రాంతంలో చోటు చేసుకున్నది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈడీలోని హై-ఇంటెన్సిటీ యూనిట్‌ (హెచ్‌ఐయూ) అధికారులు దేశవ్యాప్తంగా సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బిజ్వాసన్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హైస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు దుండగులు ఫర్మీచర్‌తో అధికారులపై భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. దాడి చేసిన వారిని అశోక్ శర్మ, అతని కుటుంబసభ్యులుగా గుర్తించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యూఆర్‌ కోడ్‌, పిషింగ్‌, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌ క్రైమ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికి తీయడానికి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

First Published:  28 Nov 2024 1:21 PM IST
Next Story