హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజాహరుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. ఆయన గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవకతకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ మేరకు ఈడీ చర్యలు చేపట్టింది.
మొదటిసారి సమన్లు అందుకున్న ఆయన ఇవాళ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి డిజిల్ జనరేటర్లు, ఫైర్‌ఫైటర్ ఇంజిన్లు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.