ఫార్మా కంపెనీలో రూ.5 వేల కోట్ల విలువై డ్రగ్స్ స్వాధీనం
518 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
BY Naveen Kamera13 Oct 2024 10:54 PM IST
X
Naveen Kamera Updated On: 13 Oct 2024 10:54 PM IST
ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 518 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ ఫార్మా కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న భారీ డ్రగ్స్ దందాను ఛేదించారు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు, గుజరాత్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి గుజరాత్ లోని అంక్లేశ్వర్ లో గల ఓ ఫార్మా కంపెనీపై దాడి చేశారు. ఈ దాడిలో 518 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ లో రూ.5 వేల కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Next Story