Telugu Global
CRIME

ప్రభుత్వాన్ని విమర్శించారని జర్నలిస్టులపై కేసులు పెట్టొద్దు

అది భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది : సుప్రీం కోర్టు

ప్రభుత్వాన్ని విమర్శించారని జర్నలిస్టులపై కేసులు పెట్టొద్దు
X

ప్రభుత్వాలపై విమర్శనాత్మక కథనాలు రాశారని జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అది భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాగం కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని కుల సమీకరణాలపై కథనం రాశారు. ఆయనపై అధికార పార్టీ నేతల ఫిర్యాదుల ఆధారంగా ఉత్తరప్రదేశ్‌ లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఆ కేసులను కొట్టేయాలని కోరుతూ అభిషేక్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ హృశికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన బెంచ్‌ శుక్రవారం ఈ పిటిషన్‌ ను విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులకు పరిరక్షణ ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాళ్లు రాసిన కథనాల ఆధారంగా క్రిమినల్‌ కేసులు పెట్టొద్దని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది.

First Published:  4 Oct 2024 2:31 PM GMT
Next Story