Telugu Global
CRIME

ఫార్ములా ఈ- రేస్‌ కేసులో సీఎం రేవంత్‌ పేరు చేర్చండి

ఫార్ములా ఈ- రేస్‌లో లేని అవినీతిని రేవంత్‌ రెడ్డి పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడిన ఆర్ఎస్‌పీ

ఫార్ములా ఈ- రేస్‌ కేసులో సీఎం రేవంత్‌ పేరు చేర్చండి
X

ఫార్ములా ఈ- రేస్‌ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకుల బృందం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్‌ఎస్‌పీ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి పేరు చేర్చాలని ఆర్‌ఎస్పీ ఫిర్యాదు చేశాం. రేవంత్‌ అనాలోచిత నిర్ణయాల వల్లనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని, అందుకే ఆయనపై బీఎన్‌ఎస్‌ 316 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాం.నేను రాజకీయాల్లో రాకముందు ఐపీఎస్ అధికారిగా పనిచేశాను. నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్‌ కాలర్‌ నేరాలను పరిశోధించాను. అడిషనల్ డీజీపీగా పనిచేశాను. వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశాను. కానీ నేడు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. లేని అవినీతిని పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని, సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

ఫార్ములా -ఈ కార్‌ రేస్‌లో విదేశీ సంస్థకు నిధులు మళ్లించి రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఎంఏయూడీ మాజీ స్పెషల్ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిపైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతున్నది. ఫార్ములా -ఈ కార్‌ రేస్‌ ను రేవంత్‌ రెడ్డి ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో రేవంత్‌ రెడ్డిని ముద్దాయిగా చేర్చి ఆయనను విచారించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు.

First Published:  28 Jan 2025 12:38 PM IST
Next Story