Telugu Global
CRIME

గురుద్వారాల్లో పాత్రలు, చెప్పులు శుభ్రం చేయండి

సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ కు అకాల్‌ తఖ్త్‌ శిక్ష

గురుద్వారాల్లో పాత్రలు, చెప్పులు శుభ్రం చేయండి
X

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ కు సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం అకాల్‌ తఖ్త్‌ శిక్ష విధించింది. గోల్డెన్‌ టెంపుల్‌ తో పాటు సిక్కలు ప్రార్థనా మందిరాలైన గురుద్వారాల్లో పాత్రలు, చెప్పులు శుభ్రం చేయాలని ఆదేశించింది. ఆయన శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని, ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని స్పష్టం చేసింది. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ మత పరమైన తప్పిదాలకు పాల్పడ్డారని అకాల్‌ తఖ్త్‌ నిర్దారించింది. తాను చేసిన తప్పులను సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అకాల్‌ తఖ్త్‌ ఎదుట అంగీకరించారు. దీంతో ఆయన తండ్రి, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కు ఫఖ్రే ఈ కవామ్‌ బిరుదును ఉపసంహరించుకుంటున్నట్టు అకాల్‌ తఖ్త్‌ స్పష్టం చేసింది.

First Published:  2 Dec 2024 9:14 PM IST
Next Story