ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఒకరైన ప్లటూన్ కమాండ్‌పై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడి
BY Raju Asari9 Nov 2024 4:15 PM GMT
X
Raju Asari Updated On: 9 Nov 2024 4:15 PM GMT
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేఖపల్లి అడవుల్లో శుక్రవారం భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఊసూరు, బాసగూడ, పామేడు, తర్రెం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్ ఫోర్స్), కోబ్రా, సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో బలగాలు జాయింట్ ఆపరేషన్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో రేఖపల్లి-కోమటపల్లి అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరైన ప్లటూన్ కమాండ్‌పై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story