ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారించాలి
మృతుల ఫొటోలు, వివరాలను స్పష్టంగా విడుదల చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం డిమాండ్
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను స్పష్టంగా పోలీసులు వెంటనే విడుదల చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం కోరింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేసింది. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 31మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.మృతుల్లో మావోయిస్టు కార్యదర్శి నంబళ్ల కేశవరావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు, అమరేశ్ అలియాస్ రామకృష్ణ, నీతి అలియాస్ ఉర్మిళ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపడుతున్నాయి.
ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ ఆలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఉర్మిల మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేశ్ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నాడు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. నీతి అలియాస్ ఉర్మిల బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది.ఆ తర్వాత భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పెద్దమొత్తంలో మావోయిస్టులను చనిపోవడం ఇదే.అబూజ్‌మడ్ ప్రాంతం మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ మధ్య విస్తరించి ఉన్నది. అక్కడ ఉన్న కొండప్రాంతం పేరు గోండి భాషలో ఉన్నది. ఆ అటవీ ప్రాంతం సుమారు 6,000 చ.కి.మీ ఉండొచ్చని అంచనా. ఇది మావోయిస్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నది. సీపీఐ (మావోయిస్ట్)కి చెందిన దాదాపు డజను మంది సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ అక్కడ ప్రచారం చేస్తారని సమాచారం.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహిస్తుండగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.