Telugu Global
CRIME

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు సీఐడీకి అప్పగింత

మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసుల విచారణ జరుగుతుండగా.. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు సీఐడీకి అప్పగింత
X

వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతున్నది. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి డీఎస్పీ విచారణ ఫైళ్లను సోమవారం సీఐడీకి అందంచనున్నారు.

కేసు ఏమిటంటే?

వైసీపీ హాయంలో 2021 అక్టోబర్‌ 19న ఆపార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడి చేశాయి. వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు తమ అనుచరలతో దాడికి వెళ్లారు. నిందితుల్లో నందిగం సురేశ్‌ సహా పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

First Published:  13 Oct 2024 10:59 AM IST
Next Story