బంజారాహిల్స్ పీఎస్ లో కేటీఆర్ పై కేసు
ఏసీబీ విచారణ అనంతరం ర్యాలీ చేశారని కేసు పెట్టిన పోలీసులు
BY Naveen Kamera10 Jan 2025 7:22 PM IST

X
Naveen Kamera Updated On: 10 Jan 2025 7:31 PM IST
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కేసులో గురువారం ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే ఏసీబీ విచారణ అనంతరం అనుమతి లేని ప్రదేశంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారని.. అడ్డుకోబోయిన పోలీసులను దుర్భాషలాడారని కూడా ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. కేటీఆర్ తో పాటు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, ముఠా జయసింహ, మన్నె క్రిశాంక్ లపై కేసు నమోదు చేశారు.
Next Story