హైదరాబాద్ లంగర్ హౌస్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు బలంగా ఆటోను, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెళ్తున్న దంపతులు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన దంపతులు బంజారాహిల్స్‌కు చెందిన మోన ఠాకూర్, దినేష్ గోస్వామిగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Add A Comment