బసవతారకం ఆస్పత్రి వద్ద కారు బీభత్సం... ఒకరు మృతి
అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు
బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయలయ్యాయి. ప్రమాదం జరిగాక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కారును అతివేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది, జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది.అదే వేగంతో వాహనం ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి నిద్రిస్తున్న వారిని ఢీకొట్టింది.ఈ ఘటనలో చనిపోయిన మృతురాలిని, గాయపడిన వారిని గుర్తించాల్సి ఉన్నది.బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుి దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.