జమ్మూకశ్మీర్‌లో బాంబు పేలుడు
ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
BY Naveen Kamera11 Feb 2025 6:50 PM IST
![జమ్మూకశ్మీర్‌లో బాంబు పేలుడు జమ్మూకశ్మీర్‌లో బాంబు పేలుడు](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402491-2-soldiers-killed.webp)
X
Naveen Kamera Updated On: 11 Feb 2025 6:50 PM IST
జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో గల లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద మంగళవారం భారీ పేలుడు సంబవించింది. ఈ పేలుడులో సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లో భటల్ ఏరియాలో మధ్యాహ్నం 3:50 గంటల ప్రాంతంలో బాంబు పేలిందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇద్దరు సైనికులు మృతిచెందగా, కెప్టెన్ సహా మరో ముగ్గురు గాయపడ్డారని.. వారికి ప్రాణాపాయం లేదని వెల్లడించింది. అఖ్నూర్ సెక్టార్ లోని నమందార్ గ్రామ సమీపంలోని ప్రతాప్ కెనాల్ వద్ద బాంబును గుర్తించిన భద్రత బలగాలు దానిని డిస్పోజల్ చేశాయి. అదే ప్రాంతంలో మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
Next Story