ఆర్‌జే శేఖర్ బాషాపై మరో కేసు నమోదు
శేఖర్ బాషా తన కాల్ రికార్డ్ చేశారని కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఫిర్యాదు
బిగ్‌బాస్ ఫేమ్ ఆర్‌జే శేఖర్ బాషాపై మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా తన కాల్ రికార్డ్ చేశారని శ్రష్ఠి వర్మ ఫిర్యాదు చేసింది. తనపరువుకు భంగం కలిగేలా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో మాట్లాడుతున్నాడని అతడిపై చర్యలు తీకోవాలని కోరింది. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేట్ కాల్ రికార్డులు లీక్ చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసులు శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతని వద్ద ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజస్‌లు సీజ్ చేయాలని కోరింది.ఆమె ఫిర్యాదు మేరకు శేఖర్ బాషాపై బీఎన్‌ఎస్ 79,67, ఐటీ చట్టం 72 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్ర ష్టి వర్మ గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్టై జైలుకు వెళ్లారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని లావణ్య పోలీసులకు ఆడియో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా ఆయనపై కేసు నమోదైంది.