అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరడంతో సోమవారానికి వాయిదా
BY Raju Asari27 Dec 2024 1:58 PM IST
X
Raju Asari Updated On: 27 Dec 2024 1:58 PM IST
సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి (డిసెంబర్ 30) వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో నేడు ఆయన వర్చువల్ గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10 తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. అల్లు అర్జున్ రిమాండ్‌పైనా విచారణ ఆ రోజే జరగనున్నది.
Next Story