Telugu Global
CRIME

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట

ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరుకావాలన్న నిబంధనకు మినహాయింపు

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
X

నాంపల్లి కోర్టులో సినీ నటుడు అల్లు అర్జునుక ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనకు మినహాయింపునిచ్చింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో బెయిల్‌ మంజూరు సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట కావాలని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్‌ కోరాడు. దీంతో కోర్టుకు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. అలాగే అల్లు అర్జున్‌ విదేశాలకు వెళ్లేందుకూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది.

First Published:  11 Jan 2025 1:22 PM IST
Next Story