Telugu Global
CRIME

గంటల్లోనే 600 మంది ఊచకోత.. ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ దుశ్చర్య

బుర్కినాపాసోలోని బార్సలోగో పట్టణంలో నరమేధం..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం

గంటల్లోనే 600 మంది ఊచకోత.. ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ దుశ్చర్య
X

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అత్యంత భయానక సంఘటన చోటుచేసుకున్నది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఊహకు అందని నరమేధం సృష్టించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 600 మందిని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు కనిపించినవారిని కాల్చారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులు కావడం గమనార్హం. అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం), ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ రెబల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నాయి. మిలటరీ సూచనతో ఆగస్టు 24న తమను తాము రక్షించుకోవడానికి స్థానికులు కందకాలు తవ్వుతుండగా ఆగ్రహించిన ఉగ్రవాదులు మహిళలను, చిన్నారులను అతి కిరాతకంగా చంపేశారు. మృతదేహాలను సేకరించడానికి మూడు రోజులు పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

First Published:  5 Oct 2024 10:15 AM IST
Next Story