Telugu Global
CRIME

నదిలో కుప్పకూలిన విమానం, హెలికాప్టర్‌

ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు

నదిలో కుప్పకూలిన విమానం, హెలికాప్టర్‌
X

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ అవుతుండగా పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం.. సైనిక హెలికాప్టర్‌ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాక్‌ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు.

నదిలో ఉష్ణోగ్రత 0 డిగ్రీలుగా ఉన్నదని అమెరికా జాతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. అంతటి చల్లని నీరులో అకస్మాత్తుగా పడిపోవడం వల్ల శ్వాసక్రియ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని, కొన్నిసారల్ఉ గుండె వేగం పెరిగి స్ట్రోక్‌ రావచ్చొని నిపుణులు తెలిపారు.

30 సెకన్లలోనే అంతా జరిగిపోయింది

రోనాల్డ్‌ రీగన్‌ విమానాశ్రయం వద్ద పోటోమాక్‌ నదిలో చిన్న విమానం కూలిపోయింది. రీగన్‌ ఎయిర్‌పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రన్‌వే పై ప్రయాణికుల విమానాన్ని దించడానికి ఏటీసీ లైన్‌ క్లియర్‌ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో అటుగా ఓ మిలటరీ హెలికాప్టర్‌ వచ్చింది. మీ ముందు విమానం వస్తున్నది కనిపిస్తున్నదా? అని రేడియో కాల్‌ పంపించిన క్షణాల్లోనే ఘటన జరిగింది.

First Published:  30 Jan 2025 10:40 AM IST
Next Story