Telugu Global
CRIME

ఇరిగేషన్‌ ఏఈఈకి మస్తు మస్తు ఆమ్దానీ!

ఏసీబీ తనిఖీల్లో భారీగా పట్టుబడిన బంగారం

ఇరిగేషన్‌ ఏఈఈకి మస్తు మస్తు ఆమ్దానీ!
X

ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గా పని చేస్తున్న వ్యక్తికి మస్తు మస్తు ఆమ్దానీ ఉన్నట్టుగా ఏసీబీ తనిఖీల్లో బయట పడింది. ఏఈఈ నీలేశ్‌ కుమార్‌ ఇల్లు, ఫాం హౌస్‌లు, ఆయన సన్నిహితులు, బంధువుల ఇండ్లల్లో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. మొత్తం 30 ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో కేజీల కొద్ది బంగారాన్ని గుర్తించారని సమాచారం. ఇండ్లు, భూములు, అన్ని ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిఖేశ్‌ కుమార్‌ 2013లో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈఈగా చేరారు. ఈ ఏడాది 31న లంచం తీసుకుంటూ నీలేశ్‌ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కేవలం పదేళ్ల సర్వీస్‌ లో ఒక అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇంత భారీ మొత్తంలో సంపాదించడంపై ఏసీబీ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  30 Nov 2024 3:46 PM IST
Next Story