Telugu Global
CRIME

ఆర్టీవో చెక్‌ పోస్టులపై ఏసీబీ రెయిడ్స్‌

మూడు జిల్లాల్లోని చెక్‌పోస్టుల్లో సోదాలు

ఆర్టీవో చెక్‌ పోస్టులపై ఏసీబీ రెయిడ్స్‌
X

రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ స్టేట్‌ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు రెయిడ్స్‌ చేస్తున్నారు. మూడు జిల్లాల్లోని ఇంటర్‌ స్టేట్‌ చెక్‌ పోస్టులపై రెయిడ్స్‌ కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని భోరజ్‌ చెక్‌ పోస్ట్‌, నల్గొండ జిల్లాలోని విష్ణుపురం చెక్‌ పోస్టు, జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆయా చెక్‌పోస్టుల్లో అక్రమంగా ఉన్న రూ.1.78 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. చెక్‌పోస్టుల్లో తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. తనిఖీల అనంతరం ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో కొనసాగుతున్న అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

First Published:  4 Dec 2024 3:44 PM IST
Next Story