కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ నోటీసులు
ఈనెల 9న విచారణకు రావాలని కోరిన పోలీసులు
ఫార్ములా -ఈ కేసులో విచారణకు రావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఓరియన్ వెల్లాస్ కు వెళ్లిన ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో నోటీసు అందజేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కేటీఆర్ ను విచారణకు రావాలని ఇదివరకే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈక్రమంలోనే కేటీఆర్ తన అడ్వొకేట్ తో కలిసి బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. కేటీఆర్ ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినందున ఆయనను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. అడ్వొకేట్ లేకుండా తాను విచారణకు రాలేనని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేశారు. దీంతో ఏసీబీ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈనెల 9వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసారి కూడా వ్యక్తిగతంగానే హాజరు కావాలని, లీగల్ టీమ్‌కు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలా అని కేటీఆర్ లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.