Telugu Global
CRIME

6న విచారణకు రండి.. కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా - ఈ రేస్‌ కేసులో విచారణ రావాలని కోరిన ఏసీబీ

6న విచారణకు రండి.. కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులు
X

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా - ఈ రేస్‌ కేసులో ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది. ఫార్ములా - ఈ కేసులో తాను ఎలాంటి ప్రయోజనం పొందలేదని.. అవినీతే జరగనప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై ఇప్పటికే విచారణ పూర్తికాగా తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠత నెలకొంది. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ నేపథ్యంలో ఏసీబీ వాదన పేలవంగా ఉండటం, కేసులో ఫిర్యాదుదాడిగా ఉన్న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌ మినహా ఇంకెవ్వరిని విచారించకపోవడంతో అసలు అ కేసు నిలబడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌ ఆమోదంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు కాబట్టి ఏసీబీ విచారణలో ముందుకే వెళ్తుందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

First Published:  3 Jan 2025 5:38 PM IST
Next Story