సీఎం రేవంత్ రెడ్డిని సినీ గేయ రచయిత చంద్రబోస్ మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ”నాటు నాటు” పాట రాసి ఆస్కార్ అవార్డు పొందిన చంద్రబోస్ ను ఈ సందర్భంగా సీఎం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.