హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రహస్య మెడలో మూడు ముళ్లు వేశాడు. కర్నాటకలోని కూర్గ్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది.
రాజా వారు రాణిగారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. అదే సినిమాతో రహస్య హీరోయిన్ గా పరిచయమైంది. అప్పుడే ఇద్దరూ క్లోజ్ అయ్యారు. అలా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
తాజాగా కిరణ్-రహస్య నిశ్చితార్థం పూర్తయింది. నిన్న రాత్రి ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజావారు రాణిగారు తర్వాత రహస్య మళ్లీ సినిమాలు చేయలేదు. భర్త కిరణ్ తో కలిసి త్వరలోనే ఓ సినిమా చేస్తానంటోంది.
ప్రస్తుతం ‘క’ అనే సినిమా చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ హీరో కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈమధ్య టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పాటల ప్రమోషన్స్ మొదలుపెట్టారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.



