ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవలేదు. అదృష్టం కలిసొస్తుందని తమ పేరులో అక్షరాలు మార్చుకున్న నటీనటులు చాలామంది. పూర్తిగా పేరు మార్చుకున్న హీరోహీరోయిన్లు కోకొల్లలు. ఇప్పుడు పూరి జగన్నాధ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి కూడా పేరు మార్చుకున్నాడు.
ఇకపై తనను ఆకాష్ పూరి అని పిలవొద్దంటున్నాడు ఈ నటుడు. ఇతడి కొత్త పేరు ఆకాష్ జగన్నాధ్. ఇన్నాళ్ల తన తండ్రి పేరు పూరీ జగన్నాధ్ లోని తొలి పదాన్ని వాడుకున్న ఆకాష్.. ఇప్పుడు తండ్రి పేరులోని మలి పదాన్ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. తనను సంబోధించేటప్పుడు ఆకాష్ జగన్నాధ్ అని పిలవాలని ఆయన కోరుతున్నాడు.
అయితే ఒక్కసారి అలవాటుపడిన జనాలు, ఒక్కసారిగా మారతారా అనేది సందేహమే. ఈమధ్య సాయిధరమ్ తేజ్ కూడా తన పేరు మార్చుకున్నాడు.
తనను సాయిదుర్గ తేజ్ గా పిలవాలని పిలుపునిచ్చాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అంతా సాయిధరమ్ తేజ్ అంటున్నారు. ఒక దశలో సాయితేజ్ అని చెప్పుకొచ్చినా ఎవ్వరూ వినలేదు. మరి ఆకాష్ పూరీని ఇకపై ఆకాష్ జగన్నాధ్ అని ఎంతమంది పిలుస్తారో చూడాలి.