పనిలో రాణించాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే!
ప్రస్తుతం ఉన్న రోజుల్లో పని చేసే చోట సాఫ్ట్‌స్కిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని లింక్డ్ ఇన్ వంటి సంస్థలు నిర్వహించిన పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. క్రియేటివ్ స్కిల్స్ లేక చాలామంది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కూడా వెనుకబడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి.
పనిచేసే చోట రాణించటం ఈ రోజుల్లో చాలాకష్టంగా మారుతోంది. ప్రతిభ ఉన్నాఎదగలేక పోతున్నవాళ్లు కొందరైతే.. ఎదుగుతున్నా, సంతృప్తి చెందలేకపోతున్నవాళ్లు మరికొందరు. దీనికి ముఖ్య కారణం సరైన సాఫ్ట్‌స్కిల్స్ లేకపోవడమే అని నిపుణులు చెప్తున్నారు. వీటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే..
ప్రస్తుతం ఉన్న రోజుల్లో పని చేసే చోట సాఫ్ట్‌స్కిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని లింక్డ్ ఇన్ వంటి సంస్థలు నిర్వహించిన పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. క్రియేటివ్ స్కిల్స్ లేక చాలామంది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కూడా వెనుకబడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. పర్సనల్ మేనేజ్‌మెంట్, క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి కొన్ని అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌ని పెంపొందించుకుంటే కెరీర్‌లో సక్సెస్ అవ్వొచ్చని నిపుణులు చెప్తున్నారు. అదెలాగంటే..
పర్సనల్ మేనేజ్ మెంట్
పనిచేసే చోట ఉన్నతి సాధించాలంటే బాస్‌లు, టీం లీడర్లు చెప్పే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. అంతకన్నా ముందు వర్క్ విషయంలో మీ బాస్ మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవాలి. దానికనుగుణంగా పనిచేస్తూ మీ ప్రత్యేకత ను చూపించే ప్రయత్నం చేయాలి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే సంస్థలు మార్కెట్ పరిస్థితులు, వ్యాపార వ్యూహాల అమలు దిశగా పయనిస్తుంటాయి. అందుకే మీరు కూడా చురుగ్గా ఉండాలి. చాలామందికి ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకు చురుకుదనం పోతుంది. ఏదో ఆఫీసుకు వెళ్లాం, డ్యూటీ చేశాం.. అన్నట్లుగా పనిచేసేస్తుంటారు. ఇలాంటి ఆలోచనా శైలిని మార్చుకోవాలి. కంపెనీ భవిష్యత్ అవసరాలను తమ ఉద్యోగులు ముందుగానే తెలుసుకోవాలని ఆశిస్తుంటుంది సంస్థ యాజమాన్యం. దానికనుగుణంగా పనిచేస్తే మీ ప్రమోషన్స్‌ని ఆపడం ఎవరివల్లా కాదు.
క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్
ఒక విషయాన్ని లాజికల్‌గా , విమర్శనాత్మకంగా ఎనలైజ్ చేయడాన్నే క్రిటికల్ థింకింగ్ అ౦టారు. సమస్యను గుర్తించి దానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి, లాజికల్‌గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మార్గాలను కనుక్కోవాలి. దీన్నే క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ప్రస్తుతం మీరు చేస్తున్న రంగ౦లో వచ్చిన, రాబోతున్న మార్పులన్నిటికీ ఇదే కారణం. ప్రొఫెషనల్ సర్వీస్, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా అవసరం.
ఇక వీటితోపాటు లీడర్ షిప్ స్కిల్స్, ఇతరులను ఆకట్టుకునేలా చాతుర్యం, క్లయింట్స్, కొలీగ్స్‌తో సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం వంటివి కూడా కెరీర్‌లో రాణించడానికి చాలా కీలకం.