హల్వా తయారీలో కేంద్ర ఆర్థిక మంత్రి
తుది దశకు 2025 - 26 బడ్జెట్ పనులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్‌లోని తన ఆఫీసులో హల్వా తయారీలో పాలు పంచుకున్నారు. ఏటా వార్షిక బడ్జెట్ కు తుది రూపు ఇచ్చే సమయంలో హల్వా తయారీ వేడుక నిర్వహంచడం, ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలోనే నిర్మలా సీతారామన్ శుక్రవారం హల్వా తయారీలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాలు పంచుకున్నారు. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కార్యక్రమ్లంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ తయారీలో పాలు పంచుకునే ఆర్థికశాఖ అధికారులు కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. వాళ్లంతా నార్త్ బ్లాక్ లోనే బస చేయాల్సి ఉంటుంది. 24 గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రత సిబ్బంది నిఘా నీడలో ఉండాల్సి ఉంటుంది. హల్వా వేడుకతో బడ్జెట్ లాక్ ఇన్ పీరియడ్ స్టార్ట్ అవుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఆర్థిక శాఖ అధికారులు, ముఖ్య ఉద్యోగులు ఫోన్‌లు, సెల్ ఫోన్లు కూడా ఉపయోగించడానికి వీలు ఉండదు. 1950వ సంవత్సరంలో ప్రవేశ పెట్టాల్సిన వార్షిక బడ్జెట్ ముందే లీక్ కావడంతో లాక్ ఇన్ పీరియర్ విధానం ప్రవేశపెట్టారు.