Telugu Global
Business

Maruti Suzuki Ertiga | ట‌యోటా ఇన్నోవా.. కియా క‌రెన్స్‌.. రెనాల్ట్ ట్రైబ‌ర్ ఉన్నా.. ఈ ఎంపీవీదే పై చేయి..!

Maruti Suzuki Ertiga | దేశీయ కార్ల విక్ర‌యాల్లో మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ (ఎంపీవీస్‌) వాటా సుమారు తొమ్మిది శాతం.

Maruti Suzuki Ertiga | ట‌యోటా ఇన్నోవా.. కియా క‌రెన్స్‌.. రెనాల్ట్ ట్రైబ‌ర్ ఉన్నా.. ఈ ఎంపీవీదే పై చేయి..!
X

Maruti Suzuki Ertiga | దేశీయ కార్ల విక్ర‌యాల్లో మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ (ఎంపీవీస్‌) వాటా సుమారు తొమ్మిది శాతం. ఎంపీవీ కార్ల‌లో ప్ర‌ముఖంగా వినిపించే కొన్ని మోడ‌ల్ కార్లు ట‌యోటా ఇన్నోవా క్రిస్టా, ట‌యోటా ఇన్నోవా హైక్రాస్‌, కియా క‌రెన్స్‌, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, రెనాల్ట్ ట్రైబ‌ర్‌, ట‌యోటా రుమియాన్ పేర్లు వినిపిస్తాయి. వీటితోపాటు మ‌రో మోడ‌ల్ ఎంపీవీ సెగ్మెంట్‌లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న మోడ‌ల్ కారు మారుతి సుజుకి ఎర్టిగా.

అనునిత్యం దేశీయ కార్ల మార్కెట్‌లో స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ) కార్ల పాపులారిటీ పెరిగిపోతున్నా.. ప్ర‌స్తుతం దేశంలోని బెస్ట్ సెల్లింగ్ కార్ల‌లో నిరంత‌రం మారుతి సుజుకి ఎర్టిగా చోటు చేసుకుంటూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశంలోని టాప్‌-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల‌లో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. 2023-24లో 1,49,757 యూనిట్ల మారుతి సుజుకి ఎర్టిగా కార్ల విక్ర‌యాలు న‌మోద‌వుతున్నాయి. మ‌హీంద్రా స్కార్పియో, హ్యుండాయ్ వెన్యూ, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, కియా సోనెట్‌, కియా సెల్టోస్ వంటి పాపుల‌ర్ ఎస్‌యూవీ కార్లు అధిక మొత్తంలో అమ్ముడ‌వుతున్నా మార్కెట్‌లోనూ, క‌స్ట‌మ‌ర్ల‌లోనూ మారుతి ఎర్టిగా కు ఉన్న స్థానం య‌ధాత‌థంగా కొన‌సాగుతోంది.

గ‌త నెల‌లోనూ టాప్‌-10 కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి ఎర్టిగాకు ఏడో ర్యాంక్ ల‌భించింది. 2024 మే నెల‌లో 13,893 కార్ల విక్ర‌యాల‌తో ఇంప్రెసివ్ సేల్స్ న‌మోద‌య్యాయి. మారుతి ఎర్టిగా`కు స‌మీప ప్ర‌త్య‌ర్థి ట‌యోటా ఇన్నోవా (క్రిస్టా అండ్ హైక్రాస్) 8,548 యూనిట్లు అమ్ముడ‌య్యాయి.

2024 మే నెల‌లో ఎంవీపీ కార్ల సేల్స్ వివ‌రాలు ఇలా :

మారుతి సుజుకి ఎర్టిగా - 13,893 యూనిట్లు

ట‌యోటా ఇన్నోవా (క్రిస్టా అండ్ హైక్రాస్‌) - 8,548 యూనిట్లు

కియా క‌రెన్స్ - 5,316 యూనిట్లు

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 - 3,241 యూనిట్లు

రెనాల్ట్ ట్రైబ‌ర్ - 2,116 యూనిట్లు

ట‌యోటా రుమియాన్ - 1,919 యూనిట్లు

First Published:  17 Jun 2024 7:05 AM GMT
Next Story