Ultraviolette F77 Mach 2 | ఆల్ట్రావయోలెట్ నుంచి ఎఫ్77 ఈవీ అప్‌డేటెడ్ బైక్ ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2.. రూ.2.99 లక్షల నుంచి షురూ..!
Ultraviolette F77 Mach 2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంస్థ ఆల్ట్రావయోలెట్ (Ultraviolette) తన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 (Ultraviolette F77) అప్‌డేటెడ్ వర్షన్ ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది.
Ultraviolette F77 Mach 2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంస్థ ఆల్ట్రావయోలెట్ (Ultraviolette) తన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 (Ultraviolette F77) అప్‌డేటెడ్ వర్షన్ ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. ఈ అప్‌డేటెడ్ మోటారు సైకిల్‌లో సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ అప్‌డేట్ చేశారు. ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. తొలి 1000 బుకింగ్స్‌కు ఈ ధర వర్తిస్తుంది. కస్టమర్లు ఇప్పటి నుంచి తమ ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్ బుక్ చేసుకోవచ్చు.
10-లెవెల్ రీజెన్ మోడ్స్ (10-level regen modes)తో ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 (Ultraviolette F77 Mach 2) అప్‌డేట్ చేశారు. నేరుగా రైడింగ్ మోడ్స్ గానీ, వ్యక్తిగతంగా గానీ వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి.
ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్ మూడు వేర్వేరు థీమ్స్, తొమ్మిది వేర్వేరు రంగుల్లో లభిస్తుంది. స్టెల్లార్ వైట్, సూపర్ సోనిక్ సిల్వర్, లైటెనింగ్ బ్లూ, లేసర్ విత్ ప్లాస్మా రెడ్, టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్ ఎల్లో కలర్ వేస్‌తోపాటు స్టెల్త్ గ్రే, ఆస్ట్రయిడ్ గ్రే, కాస్మిక్ గ్రే కలర్స్‌లోనూ లభిస్తుంది.
ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 (Ultraviolette F77) మోటారు సైకిల్ ధర రూ.2.99 లక్షల నుంచి రూ.3.99 లక్షల వరకూ, ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 రెకోన్ ధర రూ.3.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్ రెజిన్ బ్రేకింగ్, ఏబీఎస్ సేఫ్టీ, స్టెబిలిటీ స్టాండర్స్ కలిగి ఉంటుంది. కొండలు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే సమయంలో హిల్ హోల్డ్ ఫీచర్ ఉంటుంది. ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 (Ultraviolette F77 Mach 2) ఫోన్ డెల్టా వాచ్ ఫీచర్ ఉంటుంది. బైక్ స్టేటస్ తెలుసుకోవడానికి, అలారాం మాదిరిగా ఓనర్లకు స్మార్ట్‌ఫోన్లలో అల్టర్ పంపుతుంది. డైనమిక్ రెజెన్, 4-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వయోలెట్ ఏఐ, రైడర్ ఆఫ్ మూవ్‌మెంట్, ఫాల్, టాయ్ అలర్ట్, క్రాష్ అలర్ట్, డైలీ స్టాట్స్, యాంటీ కొల్లిషన్ వార్నింగ్ సిస్టమ్, టెయిల్ లాంప్ థ్రోబింగ్ ఎఫెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.